సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, బహుజన్ సమాజ్ పార్టీలు నిర్ణయించాయి. ఉత్తరప్రదేశ్ లోని లఖ్‌నవూకు వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. తెలంగాణలోనూ కలిసి పని చేస్తామని పవన్ చెప్పారు. మాయావతి ప్రధాని కావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. త్వరలోనే సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశానికి భాజపా, కాంగ్రెస్ చేసిందేమీ లేదని మాయావతి అన్నారు. ప్రజలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
బహుజన సమాజ్తో జనసేన పొత్తు - పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బహుజన్ సమాజ్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. తెలంగాణలోనూ తమ మధ్య పొత్తు ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ చెప్పారు. లఖ్‌నవూ వెళ్లి మాయావతితో పొత్తులపై చర్చించారు.
బహుజన సమాజ్తో జనసేన పొత్తు