ధాన్యం కొనుగోలుపై శ్రద్ధ పెట్టాల్సిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో ఈటల వర్గీయులను కొనడంలో బిజీగా ఉన్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఏ పార్టీ నుంచి ఎవరినీ కొనాలనేదే తెరాస పార్టీ లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల గోసలను పట్టించుకునే వారు ప్రభుత్వంలో లేరని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తోన్నారని విమర్శించారు.
Komatireddy: 'ఈటల వర్గీయులను కాదు... ధాన్యం కొనండి' - telangana news
తెరాస ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రోడ్డుపై రైతన్న పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన 30ఏళ్ల రాజకీయ చరిత్రలో ధాన్యం కొనుగోలులో ఇంతలా అలసత్వం చూపించే ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు.
![Komatireddy: 'ఈటల వర్గీయులను కాదు... ధాన్యం కొనండి' Komatireddy's criticisms of the Trs government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12029257-972-12029257-1622901462912.jpg)
ఐకేపీ సెంటర్లకు రైతులు ధాన్యం తీసుకువచ్చి రెండు నెలలుగా కావస్తున్నా కొనుగోలు చేయట్లేదని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి రూ. 11లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పుకునే కేసీఆర్ మూసీ నది శుద్ధకి రూ. 3వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయట్లేదని ప్రశ్నించారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లో పండిన పంటను కొనుగోలు చేయకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యకం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి:CM KCR: పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో సర్కారు కృషి