అసోం రాష్ట్రంలోని గువహటి నగరంలోని ఫ్యాన్సీ బజార్ ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర పుష్కరాలకు అనుమతి కోరుతూ... ఆ రాష్ట్ర తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు లేఖ అందజేశారు. నవంబర్ 5 నుంచి 16 వరకు పుష్కర కార్యక్రమం కొనసాగుతుందని లేఖలో పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం నుంచి దాదాపుగా 3 నుంచి 5 లక్షల మంది భక్తులు బ్రహ్మపుత్ర పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిపారు. అందుకు అనుగుణంగా భక్తులకు అవసరమైన, తాగు నీటి సౌకర్యం, బయో టాయిలెట్స్, సెక్యూరిటీ లాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
'బ్రహ్మపుత్ర పుష్కరాలకు అనుమతి ఇవ్వండి' - గువహటి
అసోం రాష్ట్రంలో గువహటి నగరంలోని ఫ్యాన్సీ బజార్ ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర పుష్కరాలకు అనుమతి కోరుతూ.... అసోం తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు పి.శ్రీనివాస్ రెడ్డి స్థానిక డిప్యూటీ కమిషనర్‌కు లేఖ అందజేశారు.
Assam
అసోంలో దాదాపు 70 వేల మంది తెలుగు వారు ఉన్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు అసోసియేషన్ తరఫున కూడా ప్రభుత్వానికి సహాయం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:2వేల మంది రాజ్‌పుత్ వనితల 'తల్వార్ రాస్'
Last Updated : Aug 23, 2019, 5:32 PM IST