నల్గొండ జిల్లాలో మురుగు నీటి సమస్య పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దుర్వాసనతో ప్రజలు విలవిల్లాడుతున్నారని... పండిన పంటలు కూడా తినలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినా... తమ కుటుంబంపై ప్రజలకున్న విశ్వాసమే తనను గెలిపించిందని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను ప్రశ్నించే గొంతుక కావాలనే ఓటర్లు తనకు పట్టం కట్టారని పేర్కొన్నారు. నియోజక వర్గ సమస్యలతో పాటు విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానంటున్న కోమటిరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'నియోజక వర్గ సమస్యలు పరిష్కారానికే తొలి ప్రాధాన్యం' - కోమటిరెడ్డి ముఖాముఖి
నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యమిస్తానని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు విసిగిపోయి ప్రజలు తనను గెలిపించారని పేర్కొన్నారు. విభజన చట్టంలో ప్రతిపాదించినట్లుగా నిధులు రాబట్టేందుకు కేంద్రంతో పోరాడుతానని స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి