Bhogi Festival Importance 2024: ధనుర్మాసంలో వచ్చే భోగికి భోగి పర్వం, భోగభాగ్యాలను తీసుకువచ్చే పండుగ అని పేరు. ఈ పండుగ వస్తుందంటే రెండు రోజుల ముందే చిన్న, పెద్ద అందరూ కలిసి మంట వేసేందుకు కలప గురించి ఎలా అని ఆలోచించడం మొదలుపెడతారు. ఊరు శివారు ప్రాంతంలో పాత పడిన కర్రలను తీసుకువస్తారు. సేకరించిన తరవాత పండుగ ముందు రోజు రాత్రికి అన్ని సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున అందరూ నిద్ర లేచి, నలుగు పిండితో స్నానం చేసి భోగి మంటను వేస్తారు.
Bhogi Festival Process : భోగి మంటల దగ్గరకు పెద్దలు, చిన్నవారు వచ్చి చలి మంట కాచుకుంటారు. మరికొందరు గొబ్బెమ్మలను, పిడకలను వేస్తారు. మంటలు పెద్దవిగా రావడానికి మామిడి, రావి, మేడి తదితర ఔషధ మొక్కల ఆకులను వేస్తారు. మంటల్లో కాలిన ఆ ఔషధ మొక్కల గాలి పీల్చిడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో మనసు ప్రశాంతగా మారి మనలో ఉన్న చెడు లక్షణాలు, అలవాట్లు వదిలేస్తామని పూర్వికుల భావన. కానీ ప్రస్తుతం అందరూ ముందు రోజు వాహనాల టైర్లు సంపాదించి మంటలను వేస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, వాతావరణానికి కూడా హానికరం. ఈసారైన మంటల్లో టైర్లు వాడకుండా ఉండేలా చూడండి.
డ్యాన్స్‌లోనూ తగ్గేదేలే అంటున్న మంత్రి అంబటి రాంబాబు
ఇంకాభోగిమంటల్లో ఇంట్లో ఉండే పాత వస్తువులు మంటల్లో వేస్తాం. వాటిల్లో ఉండే చెదలు లాంటి పురుగులతో మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ సంప్రదాయాన్ని పెద్దలు తీసుకువచ్చారు. ఇక తెల్లవారిన తర్వాత చిన్న పిల్లల సందడి మొదలవుతుంది. ఎందుకో తెలుసా రేగుపళ్లతో చిన్నారులకు దిష్టి తీస్తారు. ఐదు సంవత్సరాల్లోపు ఉండే పిల్లలకు ముత్తైదులందరూ రేగుపళ్లు, చెరుకు ముక్కలు, బంతి పూల రెక్కలు, చాక్లెట్లు పెట్టి దిష్టి తీస్తారు. దీంతో వాటిని తీసుకునేందుకు పిల్లలందరూ సంతోషంగా వారికి నచ్చింది తీసుకుంటారు. రేగుపళ్లే ఎందుకుంటే సాక్షాత్తు నారాయణుడే రేగు చెట్టు కింద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు చేశాడని చెబుతారు. దీనికి ప్రతీకగా పిల్లలను నారాయణుడుగా భావించి రేగుపళ్లు వేసే సంప్రాదాయం వచ్చింది.