గంగపుత్రుల ఆధ్వర్యంలో మొదటిసారి భీష్ముని మహోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రశంసించారు. ధర్మాన్ని రక్షించడం కోసం విష్ణు సహస్రనామాలు పఠనం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గంగపుత్రుల చైతన్య సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
'భీష్ముని ఆశయాలు గంగపుత్రులు కొనసాగించాలి' - హైదరాబాద్ వార్తలు
భీష్మ పితామహుని ఆశయాలను గంగపుత్రులు కొనసాగించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో గంగపుత్రుల చైతన్య సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

'భీష్ముని ఆశయాలు గంగపుత్రులు కొనసాగించాలి'
మహాభారతంలో వేదవ్యాసుడు రాసిన భీష్ముని పాత్ర మహోన్నతమైనదని.. ఆయన ఆశయాలను ఆచరణలో కొనసాగించాలని కోరారు. ఏకాదశి రోజున సహస్ర నామాన్ని దేవాలయాల్లో పఠిస్తున్నామని రంగరాజన్ తెలిపారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు పూస సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.