తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhatti vikramarka: 'దళిత బంధు సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించాం' - తెలంగాణ వార్తలు

దళితబంధుపై(dalitha bandhu) సీఎం కేసీఆర్(cm kcr) సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్(congress party) తరఫున సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భట్టి విక్రమార్క నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.

Bhatti vikramarka, dalitha bandhu meet
భట్టి విక్రమార్క, దళితబంధు సమీక్ష

By

Published : Sep 13, 2021, 3:27 PM IST

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సోమవారం నిర్వహించనున్న దళితబంధు(dalitha bandhu review) సమీక్షకు హాజరుకావాలని పార్టీ నిర్ణయించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(bhatti vikramarka) వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు పార్టీకి చెందిన నాయకులతో అన్ని విషయాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. దళితబంధుపై సీఎం సమీక్షలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై నాయకుల నుంచి సలహాలు తీసుకున్నామని వివరించారు. భట్టి విక్రమార్క నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక భేటీలో కాంగ్రెస్(congress party) కీలక నేతలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిర్వహించనున్న దళితబంధు సమావేశంలో పాల్గొని... లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్లు భట్టి వెల్లడించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానుందన సీఎం దళితబంధు సమీక్షలో ప్రస్తావించాల్సిన అంశాలతో కూడిన సందేశాన్ని పంపించినట్లు తెలిపారు. ఈ భేటీలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details