Bhatti Vikramarka on Electricity Department White Paper: ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. విద్యుత్ సంస్థల ఆస్తులు పెరిగాయనేది అవాస్తవమని అన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ సంస్థల(Telangana Electricity Deportment) ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో నాయకుల మధ్య చర్చ జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.03 లక్షలు ఉన్నాయని, ప్రస్తుతం 28 లక్షలకు చేరాయని భట్టి స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, కాలువల నుంచి నీళ్లు వస్తే ఎవరైనా కొత్త బోర్లు వేసుకుంటారా అని ప్రశ్నించారు.
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
Bhatti Vikramarka on Electricity Department: గత ప్రభుత్వం బొగ్గు లభించే ప్రాంతాల్లో పవర్‌ప్లాంట్‌లు పెట్టలేదని భట్టిఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్(Bhadradri Powerplant) ఆలస్యం కావడం వల్ల 40 శాతం అదనంగా ప్రభుత్వంపై వ్యయం పెరిగిందని దీంతో పాటు రూ.10 వేల కోట్ల భారం కూడా పడిందని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి కాకుండా బీఆర్ఎస్ ఏవైనా కొత్త ప్రాజెక్టులు నిర్మించిందా అని ప్రశ్నించారు. తమకు కనిపించకుండా బీఆర్ఎస్ కొత్త ప్రాజెక్టులు కట్టిందా అని ఎద్దేవా చేశారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని నిలదీశారు.
తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు రూ. 81,516 కోట్లు : భట్టి విక్రమార్క