క్లిష్ట సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న సోనియా గాంధీ పార్టీని ఏకతాటిపై... అధికారం వైపు నడిపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని, మంత్రి పదవులకు దూరంగా ఉండి సేవలు చేశారని కొనియాడారు.
'దేశంలో రాహుల్ గాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నారు' - భట్టి విక్రమార్క వార్తలు
రాహుల్ గాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నారని... ఆయనకు సీఎల్పీ మద్ధతు ఎల్లప్పుడు ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. మీ పోరాటాన్ని కొనసాగించాలని... రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా రాహుల్ వెంట ఉన్నారని ఆయన తెలిపారు.
'దేశంలో రాహుల్ గాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నారు'
ప్రస్తుత పరిస్థితులో సీనియర్లు లేఖలు రాసి గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వానికి మద్దతు ఇస్తారని తెలిపారు. రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నారని.. ఈ పోరాటంలో తామంతా తోడుంటామని భట్టి వెల్లడించారు.
ఇదీ చూడండి:సీనియర్లపై రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్లో దుమారం!