తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్వేష రాజకీయాలను తెలంగాణలోకి రానివ్వకూడదు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Fires on Central Government: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లక్ష్యాల్లో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్‌ ద్వారా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరాలని తెలిపారు. దేశ సంపదను మోదీ మిత్రులకు అప్పనంగా పంచిపెడుతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని ధనిక, పేద వర్గాలుగా విభజిస్తున్నారని ఆయన ఆరోపించారు.

By

Published : Feb 12, 2023, 3:44 PM IST

Bhatti Vikramarka
Bhatti Vikramarka

Bhatti Vikramarka Fires on Central Government: దేశ తొలి ప్రధాని నెహ్రూను స్ఫూర్తిగా తీసుకుని.. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినియమ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన భట్టి.. స్వాతంత్య్రం వచ్చినప్పుడు గడ్డు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. నెహ్రూ చర్యలతో దేశం అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం.. పేదల పొట్ట కొట్టి.. పెద్దలకు పెడుతోందని ఆరోపించారు.

పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో అందరూ పోరాడారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సోనియా గాంధీ ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లక్ష్యాల్లో నిరుద్యోగం ఒక పెద్ద సమస్య అని అన్నారు. బడ్జెట్‌ ద్వారా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు నెరవేరాలని పేర్కొన్నారు. ప్రతి మండలంలో 3 కేజీ టూ పీజీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.

దేశాన్ని ధనిక, పేద వర్గాలుగా విభజిస్తున్నారు: చేపల అమ్మకం అవుట్ లెట్స్ పరిశుభ్రంగా ఉండాలని భట్టి విక్రమార్క వివరించారు. సర్పంచులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను మోదీ మిత్రులకు అప్పనంగా పంచిపెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని ధనిక, పేద వర్గాలుగా విభజిస్తున్నారని మండిపడ్డారు. లౌకిక భావాలు కలిగిన నాయకత్వం దేశానికి కావాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

వైద్యానికి బడ్జెట్‌లో ఇంకా కేటాయింపులు పెంచాలని భట్టి విక్రమార్క సూచించారు. పోడు భూములను త్వరగా గిరిజనులకు పంచాలని పేర్కొన్నారు. అటవీ అధికారులపై దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు. జర్నలిస్టులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థలాలు కేటాయించాలని భట్టి విక్రమార్క కోరారు.

"దేశ తొలి ప్రధాని నెహ్రూను సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నెహ్రూ బాటలో నడవాలి. ఇప్పుడున్న ప్రధానికి శాస్త్రీయత లేదు. కొవిడ్‌ వస్తే చప్పట్లు కొట్టాలని చెప్పారు. ఉపాధి హామీ నిధుల్లో భారీగా కోత పెట్టారు. పదేళ్లైనా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చలేదు. నీటి కోసం అందరం కలిసి పోరాటం చేయాల్సి ఉంది. విద్వేష రాజకీయాలను తెలంగాణలోకి రానివ్వకూడదు."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

విద్వేష రాజకీయాలను తెలంగాణలోకి రానివ్వకూడదు:భట్టి విక్రమార్క

ఇవీ చదవండి:2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది లక్ష్యం: సీఎం కేసీఆర్

ఆజాద్ విగ్రహం నుంచి నీటి చుక్కలు.. భక్తితో నుదుటికి రాసుకుంటున్న ప్రజలు!

ABOUT THE AUTHOR

...view details