అసెంబ్లీ సమావేశాలు(TELANGANA ASSEMBLY SESSION) కనీసం 20 రోజులైనా నిర్వహించాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క(BHATTI VIKRAMARKA) డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశమై ఆరు నెలలు అయిందని, చాలా అంశాలు చర్చించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా నిరుద్యోగం, పంటలసాగు, కొనుగోళ్లు, నదీజలాలు, దళితబంధు, ధరణి పోర్టల్ సమస్య, శాంతిభద్రతలు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని భట్టి వివరించారు. రేపు అసెంబ్లీ కంటే ముందు జరిగే సీఎల్పీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు.
రేపటి నుంచి శాసనసభ సమావేశాలు (TELANGANA ASSEMBLY SESSION) ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో చర్చించే అంశాలు, పనిదినాలపై రేపు స్పష్టత రానుంది. దళితబంధు పథకం(DALITHA BANDHU) అమలు సహా పంటలసాగు(CROPS), తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు(WATER DISPUTES), ఉద్యోగాల నియామకం(JOBS), ఆర్టీసీ(RTC), విద్యుత్ ఛార్జీల పెంపు(ELECTRICITY CHARGES) సహా ఇతర అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అసెంబ్లీ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు- బీఏసీ భేటీ అవుతాయి. సమావేశాలు నిర్వహించే పనిదినాలు, చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను ఈ భేటీలో ఖరారు చేస్తారు.
ఇదీ చదవండి:TELANGANA ASSEMBLY SESSION : రేపటి నుంచి శాసనసభ సమావేశాలు