తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహపూర్వక పార్టీ... ప్రతిపక్షమెలా అవుతుంది? - SABHAPATHI

ప్రధాన ప్రతిపక్షం సీట్లను ఎంఐఎం​కు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ్యుడు శ్రీధర్ బాబుతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభాపతి పోచారం శ్రీనివాస్​కు ఫిర్యాదు చేశారు.

స్నేహపూర్వక పార్టీ... ప్రతిపక్షమెలా అవుతుంది?

By

Published : Sep 14, 2019, 12:42 PM IST

Updated : Sep 14, 2019, 2:47 PM IST

ప్రధాన ప్రతిపక్షం సీట్లను ఎంఐఎంకు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తమ అసమ్మతిని తెలుపుతూ సభాపతి పోచారానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లేఖను అందజేశారు. సభలో అసమ్మతి స్వరానికి తగిన స్థానం ఇవ్వడం లేదని... ఆ బాధతోనే తాను ఈ ఉత్తరం రాస్తున్నట్లు భట్టి లేఖలో పేర్కొన్నారు. ఎంఐఎం, తెరాస అధినేతలిద్దరూ తాము స్నేహపూర్వక పార్టీలు అని ప్రకటించినట్లు వివరించారు. స్నేహపూర్వక పార్టీని ప్రతిపక్ష పార్టీగా ఎలా పరిగణిస్తారని భట్టి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూర్చున్న ప్రతిపక్ష బ్లాక్‌ను, స్నేహపూర్వక పార్టీకి కేటాయించడం సరికాదని హితవు పలికారు. ఎంఐఎంకు సీట్లు కేటాయించడం... సభలో నిజమైన ప్రతిపక్ష పార్టీని అణచివేయడమే తప్ప మరొకటి కాదని భావిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభంలో ప్రతిపక్ష పార్టీలలో ఎక్కువ మంది శాసనసభ్యులను కలిగి ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ... హస్తం పార్టీనే అని అందువల్ల కాంగ్రెస్​నే ప్రతిపక్ష పార్టీగా పరిగణించాలని కోరారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం హస్తం సభ్యులకు ప్రతిపక్ష బ్లాక్​ను తిరిగి కేటాయించాలని కాంగ్రెస్ శ్రేణులు అభ్యర్థిస్తున్నారు.

స్నేహపూర్వక పార్టీ... ప్రతిపక్షమెలా అవుతుంది?
Last Updated : Sep 14, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details