తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి... వెంటనే విధుల్లోకి తీసుకోవాలి' - ప్రైవేటు ఉద్యోగుల వార్తలు

లాక్​డౌన్​ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బీఎంఎస్ కార్యకర్తలు హైదరాబాద్ కలెక్టరేట్​ ముందు ధర్నాకు దిగారు. ఉద్యోగాలు లేక లక్షలాది మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

bharatiya-mazdoor-sangh-protest-at-hyderabad-collectorate-on-private-employees
'ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి... వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'

By

Published : Oct 5, 2020, 2:07 PM IST

కరోనా కారణంగా వివిధ ప్రైవేటు సంస్థలలో పని చేస్తున్న కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ... భారతీయ మజ్దూర్ సంఘ్​(బీఎంఎస్‌) హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించింది. ప్రైవేటు రంగంలో చాలా మంది పేద కార్మికులు పని చేస్తున్నారని... వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదు నెలలుగా జీతాలు లేక పస్తులుంటున్నారని... అయినప్పటికీ ప్రైవేటు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వివిధ రంగాలలో పని చేసే లక్షలాది మంది కార్మికులు... ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:వ్యవసాయ చట్టాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్​ కొత్త బిల్లు

ABOUT THE AUTHOR

...view details