తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ పనిచేస్తుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ డివిజన్ భాజపా కార్యాలయంలో ఆమె అధ్యక్షతన నిర్వహించారు. భాజపాను బలపర్చడంలో మజ్దూర్ సెల్ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తారని ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం: డీకే అరుణ - భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ పనిచేస్తుందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కార్యాలయంలో నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం : డీకే అరుణ
మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా శివాజీతో పాటు పల్లపు గోవర్ధన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని డీకే అరుణ విమర్శించారు. సీఎం కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. రానున్న ఎన్నికల్లో భాజపా విజయ పతాకం ఎగురవేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.