తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​ @7PM - Bharath top ten news for 7pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Bharath top ten news for 7pm
టాప్​ 10 న్యూస్​ @7PM

By

Published : Jun 5, 2020, 6:54 PM IST

ఇరు రాష్ట్రాలు డీపీఆర్​లు ఇవ్వాలి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​ ఇవ్వాలని గోదావరి బోర్డు ఆదేశించింది. టెలీమెట్రీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై కమిటీ ఏర్పాటు చేసినట్లు బోర్డు ఛైర్మన్​ చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. ఇంకేమన్నారంటే...

అవి పాటిస్తేనే పది పరీక్షలకు అనుమతి

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తే ఇబ్బందేమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్ష కేంద్రాలు కంటైన్​మెంట్ ప్రాంతాలుగా మారితే.. ఎలా వ్యవహరిస్తారో తెలపాలని ఆదేశించింది. ఇంకేమందంటే...

తీర్థ ప్రసాదాలివ్వరు

సోమవారం నుంచి దేవాలయాల్లోకి భక్తులను అనుమతించనున్నారు. కానీ భక్తులకు తీర్థ ప్రసాదాలివ్వరటా..

'7 సెంట్లే' వివాదానికి కారణం

ఏపీలో విజయవాడ గ్యాంగ్​వార్​కు యనమలకుదురులోని 7 సెంట్ల స్థలమే వివాదానికి కారణమని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇంకేమన్నారంటే...

వలసకూలీల ఉపాధి కల్పనపై సుప్రీం తీర్పు వాయిదా

వలస కూలీలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అవేంటంటే..

ఏనుగు మృతిపై కొత్త ట్విస్ట్

కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును ఆహారం ఆశ చూపి పేలుడు పదార్థాలతో చంపారన్న వార్తలను నమ్మొద్దని పేర్కొంది ఆ రాష్ట్ర అటవీ శాఖ​. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వచ్చే వారం నుంచి విస్తారంగా వర్షాలు

వచ్చే వారం నుంచి మధ్య, దక్షిణ భారత్​లో విస్తారంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇంకేం చెప్పిందంటే....

ఆ సంఖ్యకు, ఫ్లాయిడ్​ మృతికి లింకేంటి?

యావత్ అమెరికా జాత్యహంకార వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతోంది. కొన్ని చోట్ల శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నిరసనల్లో కొద్ది రోజులుగా ఓ సంఖ్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ సంఖ్య ఎంతంటే...

'అందుకే సామాజిక మాధ్యమాల్లోకి రావట్లేదు'

స్టార్ క్రికెటర్​ ధోనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఎప్పటికప్పుడూ అతడి సతీమణి సాక్షి, అభిమానులతో పంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాలోకి మహీ ఎందుకు రావట్లేదు? దూరంగా ఉండటానికి గల కారణమేంటో చెప్పారు...

ట్రెండింగ్​లో బాలయ్య కామన్ డీపీ

నందమూరి హీరో బాలకృష్ణ ఈనెల 10న తన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కామన్ డీపీ విడుదలైంది. ఆ డీపీ ఏమైందంటే...

ABOUT THE AUTHOR

...view details