తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @5PM - Bharath top ten news 5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Bharath top ten news 5pm
టాప్​ 10 న్యూస్ @5PM

By

Published : Jun 4, 2020, 5:07 PM IST

డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?

హైదరాబాద్‌లో వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లకు రక్షణ కిట్లు ఇచ్చారా అని ప్రశ్నించింది. జూన్ 8లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మీ వంటల్లో నూనె ఎంత?

మనం రోజు తినే వంటల్లో ఎంత నూనె వేస్తున్నామో తెలుసా... నూనె ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వంటకాల కోసం ఎంత నూనె వాడామో తెలుసుకునేందుకు ఓ కొత్త పరికరం వచ్చేసింది. అదేంటో మీరు తెలుసుకోండి.

పది పరీక్షలపై హైకోర్టుకు నివేదిక

పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర విద్యా శాఖ నివేదించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చైనా బలగాల మోహరింపుపై ప్రభుత్వానికి నివేదిక

ఈశాన్య లద్ధాఖ్​​లో వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా చైనా బలగాల మోహరింపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి భారత బలగాలు. తక్కువ సమయంలో సైనికులను ఆ దేశం ఏ విధంగా సరిహద్దులోకి చేర్చగలిగిందనే అంశాలను తెలియజేశాయి.పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వెలుగులోకి మరో ఏనుగు దీనగాథ..!

మానవత్వానికి మచ్చ తెచ్చిన కేరళ ఏనుగు ఘటన మరవక ముందే తాజాగా మరో ఏనుగు మృతి వెలుగులోకి వచ్చింది. అది ఎక్కడంటే..

కరోనా నిర్ధరణ పరీక్షలకు ఆధార్

కరోనా బాధితుల వివరాలను మరింత కచ్చితంగా గుర్తించేందుకు చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఆధార్​ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కర్ణాటకలో మళ్లీ రాజకీయ సంక్షోభం!

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితిపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కొంతమంది భాజపా ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇందుకు ఊతమిస్తోంది. అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!

ఒకప్పుడు తీవ్ర మనోవేదనకు గురై, ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యానని చెప్పాడు సీనియర్ క్రికెటర్ ఊతప్ప. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఓ లైవ్​చాట్​లో మాట్లాడారు. ఇంకేం చెప్పారంటే...

కన్నీటి 'పరుగు'

భారతదేశంలో ఇప్పటికీ కొందరికి గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు తప్పట్లేదు! సాధారణ ప్రజల నుంచి దేశం మెచ్చిన క్రీడాకారుల వరకు ఎవరూ ఈ సమస్యకు అతీతులు కారు. ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాల కోసం పరుగెత్తిన ఓ అథ్లెట్​.. నేడు నీటి కోసం బిందెలు మోస్తోంది...

'వారు కలిసి నటించట్లేదు'

ప్రభుదేవా, నయనతార కలిసి 'కరుప్పు రాజా వైలై రాజా' చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు అవాస్తమని స్పష్టం చేశారు చిత్ర నిర్మాత ఈశ్వరీ కె.గణేశ్​. ఇంకేమన్నారంటే..

ABOUT THE AUTHOR

...view details