లాక్డౌన్ ఆంక్షలతో కరెంట్ మీటరు రీడింగ్ నమోదును తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వచ్చే నెలకు వాయిదా వేశాయి. దిల్లీలో మాత్రం ఎవరి ఇంటి మీటరు ఫొటో వారే ఫోన్లో తీసి ఆన్లైన్లో పంపితే ప్రోత్సాహకాలు ఇస్తామని దిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ప్రకటించింది. ఇందుకు దిల్లీ డిస్కంలు యాప్‌ను రూపొందించాయి. వినియోగదారులే మీటరు రీడింగ్‌ను తీసి ఆన్లైన్లో పంపడానికి అవకాశం కల్పించేందుకు ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తర తెలంగాణ డిస్కం సైతం కసరత్తు చేస్తోంది. దీన్ని వినియోగించాలంటే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి ఇవ్వాలి. టీహబ్ నుంచి పనిచేస్తున్న ఓ అంకుర సంస్థ సైతం ఇలాంటి యాప్‌ను రూపొందించింది. లాక్డౌన్లో ప్రయోగాత్మకంగా వాడేందుకు అనుమతించాలని డిస్కంలను తాజాగా కోరింది.
ఎలా పనిచేస్తుందంటే..
యాప్‌ను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో కరెంట్ కనెక్షన్ నెంబరు, ఫోన్ నెంబర్ వివరాలు నమోదు చేయాలి. మీటరు రీడింగ్‌ను నెలకోసారి ఫోన్‌తో ఫోటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే.. ఆన్లైన్ ద్వారా డిస్కంకు చేరి ఎంత బిల్లు వచ్చిందో తెలిసిపోతుంది. ఆన్లైన్లోనే సొమ్ము కూడా చెల్లించవచ్చు.
దిల్లీలో ఏం చేశారంటే..