దేశంలో కొవిడ్ కట్టడికి అనతి కాలంలోనే వందకోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన భారత్ గొప్ప మైలురాయిని చేరిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా ప్రకటించారు (Bharath Biotech MD Krishna Ella on Vaccination). ఇది ప్రభుత్వం, వ్యాక్సిన్ తయారీదారులు, హెల్త్ కేర్ వర్కర్లు, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి భారతీయుడు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు (Bharath Biotech On Vaccination).
అందరికీ కృతజ్ఞతలు
ఈ సందర్భంగా స్పందించిన భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్లా (Bharath Biotech JMD Suchitra Ella on Vaccination)... భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో తమకు సహకారం అందించిన ప్రధాన మంత్రి కార్యాలయం, హోం మంత్రిత్వ శాఖ, ఎన్ఆర్ఏ, ఐసీఎంఆర్, ఇండస్ట్రీ భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.
చాలా గర్వంగా ఉంది..
ప్రాణాంతక కరోనా మహమ్మారిని నుంచి రక్షణ పొందేందుకు తీసుకుంటున్న కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ వంద కోట్ల(India's 100 crore vaccination milestone)కు చేరడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai soundararajan) అన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో కీలక పాత్ర వహించిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. వందకోట్ల టీకాల పంపిణీ పూర్తైన సందర్భంగా హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రికి గవర్నర్ వెళ్లారు. కొవిడ్ టీకా పంపిణీలో ప్రధాన పాత్ర వహించిన ఈఎస్ఐ వైద్యులను తమిళిసై(Telangana Governor Tamilisai soundararajan) సన్మానించారు.