తెలంగాణ

telangana

ETV Bharat / state

viveka murder case: నాకు ప్రాణ భయం ఉంది: భరత్ యాదవ్

మాజీ మంత్రి వివేకాను హత్య చేయించింది ఎర్రగంగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డే అని.. వివేకా హత్య కేసు(ex minister ys viveka murder)లో అనుమానితుడుగా ఉన్న భరత్ యాదవ్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని వెల్లడించిన భరత్.. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాసినట్లు తెలిపారు.

By

Published : Nov 22, 2021, 10:38 AM IST

Viveka murder case
వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వివేకా హత్య కేసు(ys viveka murder case)లో అనుమానితుడిగా ఉన్న భరత్ యాదవ్.. తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ బంధువే ఈ భరత్ యాదవ్. పులివెందులకు చెందిన ఇతన్ని.. సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. ఇటీవల దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా భరత్ యాదవ్(Suspected Bharath Yadav) పేరు ప్రస్తావించారు.

అయితే.. వివేకాను హత్య చేయించింది ఎర్రగంగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. వివేకా హత్య గురించి తనకు సునీల్ యాదవ్.. అంతా చెప్పారని, సునీల్​కు తాను రూ.16 లక్షలు కూడా ఇచ్చానని పేర్కొన్నారు. ఆస్తి, డబ్బు కోసమే ఈ హత్య జరిగిందని తెలిపారు. ఈ విషయాలన్నీ సీబీఐ అధికారులకు తెలిపానని కూడా భరత్ యాదవ్ చెప్పారు. వివేకా హత్యను ఎవరు చేశారన్నది ముందుగా సీబీఐకి సమాచారం ఇచ్చింది తానే అని చెప్పిన భరత్.. ప్రాణభయంతోనే ఇన్ని రోజులూ బయటికి చెప్పలేదన్నారు. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాశానన్నారు.

ఇదీ చదవండి:Heart stroke on bike: బైక్​పై వెళ్తుండగా గుండె పోటు.. ఆస్పత్రికి వెళ్లే లోపే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details