తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా ప్రారంభించిన భెల్​ - హైదరాబాద్​ వార్తలు

పెరుగుతున్న డిమాండ్​కు అనుగుణంగా తన వంతు ఆక్సిజన్​ను సహాయం చేయడానికి భెల్ సంస్థ ముందుకొచ్చింది. భోపాల్, హరిద్వార్ వద్ద ఉన్న తయారీ కార్మాగారాలు.. తమ పరిసర ఆసుపత్రులకు ఆక్సీజన్ సరఫరా ప్రారంభించాయి.

Bharat Heavy Electricals Limited, BHEL, oxygen supply,
Bharat Heavy Electricals Limited, BHEL, oxygen supply,

By

Published : Apr 26, 2021, 7:54 PM IST

ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను భారత్​ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భేల్) ప్రారంభించింది. కొవిడ్ రెండో దశ కారణంగా దేశంలో పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా తన వంతు ఆక్సిజన్​ను సహాయం చేయడానికి భేల్ ముందుకొచ్చింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల కారణంగా పెరిగిన డిమాండ్ తట్టుకునేందుకు భోపాల్, హరిద్వార్ వద్ద ఉన్న భేల్ తయారీ కార్మాగారాలు.. తమ పరిసర ఆసుపత్రులకు సరఫరా ప్రారంభించాయి.

భోపాల్ ప్లాంట్‌ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు రోజుకు 6,000 క్యూబిక్ మీటర్లకు పైగా ఆక్సిజన్ వాయువును భెల్​ సంస్థ సరఫరా చేస్తోంది. వైద్య వినియోగం కోసం రోజుకు 16,000 సిలిండర్లు సరఫరా చేయడానికి హరిద్వార్ ప్లాంట్ వద్ద మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తోంది. ప్రస్తుతం రోజుకు 700 సిలిండర్ల నుంచి 2,200 సిలిండర్లు సరఫరా చేయగలదు.

సంస్థ ఇతర యూనిట్లలోనూ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి మరిన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొవిడ్‌ వ్యతిరేక యుద్ధంలో దేశానికి మద్ధతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు భెల్ అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: పార్టీ నుంచి 21 మందిని సస్పెండ్‌ చేసిన తెరాస

ABOUT THE AUTHOR

...view details