హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్(Bharat Biotech) ఇంటర్నేషనల్ మలేరియాటీకా(Bharat biotech malaria vaccine) ఉత్పత్తి చేయనుంది. అగ్రశ్రేణి ఫార్మా సంస్థ గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే)తో కలిసి ఈ టీకా అందించనున్నట్లు భారత్ బయోటెక్(Bharat Biotech) ఇంటర్నేషనల్ హెడ్ (బిజినెస్ డెవలప్‌మెంట్) డాక్టర్ రేచస్ ఎల్ల ‘ట్విటర్’లో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన తొలి మలేరియా టీకా(Bharat biotech malaria vaccine) ఇదే కావడం గమనార్హం. జీఎస్‌కే అభివృద్ధి చేసిన ‘ఆర్‌టీఎస్, ఎస్’ మలేరియా టీకాను సబ్-సహారన్ (సహారా ఎడారికి దక్షిణాన ఉన్న) ఆఫ్రికా దేశాలతో పాటు, మలేరియా తీవ్రత అధికంగా ఉన్న ఇతర దేశాల్లో చేపట్టే టీకాల కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అనుమతి ఇచ్చింది.
Bharat Biotech: మలేరియాకు భారత్ బయోటెక్ టీకా.. జీఎస్‌కే భాగస్వామ్యంతో... - జీఎస్‌కే భాగస్వామ్యంతో ఉత్పత్తి
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్(Bharat Biotech) ఇంటర్నేషనల్ మలేరియాటీకా(Bharat biotech malaria vaccine) ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. జీఎస్‌కే భాగస్వామ్యంతో టీకా(Bharat biotech malaria vaccine) అందించనున్నట్లు డాక్టర్ రేచస్ ఎల్ల ‘ట్విటర్’లో వెల్లడించారు.
ఈ నిర్ణయాన్ని జీఎస్‌కే ఆహ్వానిస్తూ, భారత్ బయోటెక్(Bharat Biotech)తో కలిసి టీకా ఉత్పత్తి చేపట్టనున్నట్లు, 2028 వరకూ ఏటా 1.5 కోట్ల డోసుల టీకా అందించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోటెక్(Bharat Biotech)కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. మలేరియా టీకా ఉత్పత్తికి ఈ ఏడాది జనవరిలో జీఎస్‌కే, భారత్ బయోటెక్(Bharat Biotech), పాథ్ (ఆరోగ్య సేవల్లో నిమగ్నమై ఉన్న ప్రపంచస్థాయి స్వచ్ఛంద సంస్థ)లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి వచ్చిన తర్వాత జీఎస్‌కే నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని భారత్ బయోటెక్ టీకా ఉత్పత్తి(Bharat biotech malaria vaccine) చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదిరింది. దీన్ని ఇప్పుడు కార్యాచరణలోకి తీసుకురానున్నారు. మలేరియా టీకా(Bharat biotech malaria vaccine)పై ఆఫ్రికా దేశాలైన ఘనా, కెన్యా, మలావిలలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించారు. దాదాపు 8 లక్షల మంది పిల్లలకు కనీసం ఒక డోసు టీకా ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. ఈ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా దీన్ని విస్తృత స్థాయిలో వినియోగించటానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీకా ఉత్పత్తి చేపట్టేందుకు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది.
ఇదీ చూడండి:'కొవాగ్జిన్'కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపుపై అక్టోబర్‌లో నిర్ణయం!