తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతం

Bharat Biotech intranasal covid vaccine భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతమైంది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

bharat biotech completes phase 3 trial of intranasal covid vaccine
భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతం

By

Published : Aug 15, 2022, 4:32 PM IST

Bharat Biotech intranasal covid vaccine: భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ బీబీవీ154 ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు వెల్లడించింది.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి దేశాలకు అతి తక్కువ వ్యయంతో టీకాను అందించాలనే లక్ష్యంతో ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సాయంతో భారత ప్రభుత్వం ఈ టీకా అభివృద్ధి, ప్రయోగాలకు సహకరించినట్లు వివరించింది. బీబీవీ154 టీకాను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్‌ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలను నిర్వహించారు. ఈ టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్ర పర్చి సులభంగా రవాణా చేయవచ్చు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీబీవీ154 టీకా విజయవంతమైందని ప్రకటించినందుకు గర్వపడుతున్నామని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు.


ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details