Bharat Biotech CMD on Fourth Wave: భారత్‌లో కొవిడ్ నాలుగో వేవ్‌పై భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పందించారు. దేశంలో నాలుగో వేవ్ వస్తుందని.. వచ్చినా భారత్‌కు తట్టుకునే సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో లాక్‌డౌన్ ఉండే అవకాశం లేదన్న ఆయన.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉంటుందన్నారు.
'ది ఎరాడికేషన్ ఇంబ్రోగ్లియో పోలియో-దిమలాడీ, ఇట్స్ రెమెడీ' పుస్తకాన్ని భారత వైరాలజీ పితామహుడు డాక్టర్ జాకాబ్ జాన్ దిల్లీలో ఆవిష్కరించారు. జాకాబ్ జాన్ రాసిన ప్రత్యేక పుస్తకాన్ని భారత్ బయోటెక్ ముద్రించింది. వైరాలజీ, పోలియో నిర్మూలన కోసం టీకాల పరిశోధన అంశాలపై పుస్తకంలో వివరించారు. టీకాల పరిశోధన, ప్రస్తుత కరోనా పరిస్థితులపైనా చర్చించారు.