నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలకు సంఘీభావంగా హైదరాబాద్‌లో భారత్ బంద్ కొనసాగుతోంది. బంద్‌కు అధికార పార్టీ తెరాసతో పాటు... కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు రహదారుల దిగ్బంధంలో పాల్గొంటున్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని... ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌లో బస్సులన్నీ డిపోలకే పరిమతమయ్యాయి.
బంద్‌కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు - భారత్ బంద్‌కు ఆర్టీసీ మద్దతు
భారత్ బంద్‌కు ఆర్టీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని... కార్మికులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్ నగరంలోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
tsrtc
హకీంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. కూకట్‌పల్లి, కాచిగూడ, బర్కత్‌పురా, హయత్ నగర్, రామచంద్రాపురం బీహెచ్ఈఎల్, మేడ్చల్, కుషాయిగూడ, గచ్చిబౌలి, జీడిమెట్ల, ఉప్పల్, మియాపూర్, హయత్ నగర్ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి :అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు