గణేశ్ నిమజ్జనం (Ganesh Immersion) విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Festival Committee) ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు తెలిపారు. వచ్చే సంవత్సరం ప్రభుత్వంతో కలిసి హైకోర్టుకు వెళతామన్నారు. హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనం జరిగేలా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
నిమజ్జనం అనంతరం పీఓపీ పరీక్షలు చేసి హైకోర్టుకు నివేదిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం హైకోర్టుకు సరైన నివేదిక ఇవ్వకపోవడం వల్లే నిమజ్జనంపై సందిగ్ధత తలెత్తిందన్నారు. ఈనెల 19న నిమజ్జనం చేయాలని అన్ని మండపాలకు విజ్ఞప్తి చేశారు.
భాగ్యనగర సమితి సుప్రీంకోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతోంది. సుప్రీంకోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. 2019 ముందు ఏ విధంగా ఉత్సవాలు నిర్వహించుకున్నామో ఈసారి అదేవిధంగా ఉత్సవాలు నిర్వహించేలా.. అంతకమించి ఉత్సవాలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఈ సంవత్సరానికి అనుమతినిచ్చింది. వచ్చే సంవత్సరం హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించమని చెప్పింది. ప్రభుత్వం హైకోర్టుకు సరైన నివేదిక ఇవ్వకపోవడం వల్లే సందిగ్ధత నెలకొంది. వచ్చే సంవత్సరం భాగ్యనగర ఉత్సవ సమితి, ప్రభుత్వం కలిసి వెళ్లి హైకోర్టులో విజయం సాధిస్తాం. ఎప్పటిలాగానే వినాయక సాగర్‌లో నిమజ్జనం జరిగేలా ప్రయత్నిస్తాం.
--- భగవంత్‌రావు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి
'సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం' ఇదీ చూడండి: