Bhagwant Rao press meet: సీఎం కేసీఆర్‌పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు అన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిశాయని అని ప్రకటించిన ఆయన నిమజ్జన కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బందికి, జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేక పోయారు:ఉత్సవ సమితి వేడుకలకు మాత్రమే అసోం సీఎంను స్వాగతించామని పేర్కొన్న ఆయన చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైకి ఆయనని రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారని మండి పడ్డారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించ లేకపోయిందని ఆయన విమర్శించారు. రాజకీయాలతో ఉత్సవ సమితికి సంబంధం లేదని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం రోజు ఏర్పాటు చేసిన స్వాగత వేదికలు ఉత్సవ సమితి ఏర్పాటు చేసిందని తమ వేదిక పైకి వచ్చిన స్థానిక తెరాస నాయకుడు తమ కార్యక్రమాన్ని వివాదం చేశారని పేర్కొన్నారు.
కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లర్లకు కారకులు: తెరాస నాయకులు రాజకీయ ప్లెక్సీలు పెట్టి రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ ప్రభుత్వమే స్వాగత వేదికను ఏర్పాటు చేశామని చెప్పుకోవడం సరికాదని ఆయన అన్నారు. చాలా ఏళ్లుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోనే ఈ స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడలేదని వివరణ ఇచ్చిన ఆయన మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఈ అలజడికి కారకులుగా అనుమానిస్తున్నామని అభిప్రాయ పడ్డారు.
"ఒక వైపు రాజకీయ చేయవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటారు. భాగ్యనగర్‌లో రాజకీయం చేసింది తెరాస నాయకులే.. పార్టీల ప్లెక్సీలు పెట్టి అక్కడ రాజకీయం చేయడం సరికాదు. మీరు మీ పార్టీల నాయకులను, కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలి. ఉత్సవ సమితికి రాజకీయం జోడించడం మంచి పద్దతి కాదు. దీనిపై ప్రభుత్వానికి బాధ్యత ఉంది. చార్మినార్ వద్ద మేము ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైకి అసోం సీఎం రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించ లేకపోయింది." - భగవంత్ రావు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి
"సీఎంపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు" ఇవీ చదవండి: