Ganesh Immersion:గణేశ్ ఉత్సవాలను రాజకీయం చేయలేదని భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించిన ఆయన ప్రభుత్వం ఇప్పటికైనా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో చర్యలు తీసుకోకపోవటం వల్లే ర్యాలీలు చేశామని రాజకీయం చేయలేదని భగవంత్ రావు వెల్లడించారు.
"గణేశ్ ఉత్సవ సమితికి రాజకీయ రంగు అంటించడం సరికాదు" - భగవంత్ రావు వ్యాఖ్యలు
Ganesh Immersion గణేశ్ ఉత్సవ సమితికి రాజకీయ రంగు అంటించడం సరికాదని భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం ఏర్పాట్లను పరీశీలించిన ఆయన ప్రభుత్వం ఇప్పటికైనా నిమజ్జనానికి తగు ఏర్పాట్లు చేయడం సంతోషకరమని అన్నారు.
"ప్రభుత్వం ఆలస్యం చేసినా మేము అభినందిస్తునాం. నిమజ్జనానికి ఏ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వాని చూడాలని గణేశ్ ఉత్సవ సమితి తరుపున కోరుకుంటున్నాం. గణేశ్ ఉత్సవ సమితి గణేశ్ ఉత్సవాలు నిర్వహించడానికే ఉంది గాని ఇందులో మరే ఉద్దేశ్యం లేదు. మంత్రి మేము హిందువులం కాదా అనడం బాధకరమైన విషయం. గణేశ్ ఉత్సవ సమితి ఏ రాజకీయ పార్టీ తరుపున మాట్లడలేదు. మాకు ప్రభుత్వం నుంచి రాజకీయ రంగు అంటించకండి. ఇప్పుడుకైనా చాలా సంతోషకరమైన విషయం ప్రభుత్వం నిమజ్జన ఏర్పట్లు చేయడం. విగ్రహాలు చాలా జాగ్రత్తగా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాలి. చెత్త నీటిలో మున్సిపల్ వాహనాల్లో వాటిని తరలించడం అనేది మేము సహించం."-భగవంత్ రావు, ప్రధాన కార్యదర్శి భాగ్యనగర ఉత్సవ కమిటీ
ఇవీ చదవండి: