ఏడాదిగా కొవిడ్ సంక్షోభంలో ముందుండి పోరాడుతోన్న పోలీసుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బియాండ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ.. వారికి ఎన్-95 మాస్కులను పంపిణీ చేసింది. సంస్థ వ్యవస్థాపకులు నర్సింగ్‌రావు.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పీఎస్‌కు చెందిన 50 మందికి మాస్క్‌తో పాటు.. ఫేస్ షీల్డ్, స్టిమర్లను అందజేశారు.
పోలీసులకు ఎన్-95 మాస్కుల పంపిణీ - బంజారాహిల్స్‌లోని పోలీస్ స్టేషన్
కరోనా కట్టడిలో భాగంగా ఏడాది కాలంగా పోలీసులు అలుపెరుగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో శ్రమిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వారియార్స్ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ.. బంజారాహిల్స్ పోలీసులకు ఎన్-95 మాస్కులను పంపిణీ చేసింది.
N-95 MASKS
కరోనా కట్టడిలో భాగంగా ఏడాది కాలంగా పోలీసులు చేస్తోన్న సేవలు ఎనలేనివని నర్సింగ్‌రావు కొనియాడారు. అలుపెరుగకుండా విధులు నిర్వర్తిస్తోన్న వారికి తమ వంతుగా సాయం చేసినట్లు వివరించారు.