హైదరాబాద్ నెహ్రు జూలాజికల్ పార్కులో 11 ఏళ్ల కదంబ అనే మగ రాయల్ బెంగాల్ టైగర్ చనిపోయింది. శనివారం రాత్రి 9 గంటల 20 నిమిషాలకు పులి చనిపోయినట్లు నెహ్రు జూలాజికల్ పార్క్ క్యూరేటర్ తెలిపారు. కదంబలో ఎలాంటి అనారోగ్య కారణాలు లేకపోయినప్పటికీ.. గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోవడం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. పులిని కొన్ని రోజులుగా పశువైద్యుల పర్యవేక్షణలో పెట్టారు.
నెహ్రూ జూపార్కులో గుండెపోటుతో రాయల్ బెంగాల్ టైగర్ మృతి - హైదరాబాద్ వార్తలు
15:45 July 05
హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
జంతువుల మార్పిడిలో భాగంగా 2014 మార్చి 6న మంగుళూరు పిలుకుల బయోలాజికల్ పార్క్ నుంచి కదంబని హైదరాబాద్‌కు తీసుకొచినట్లు క్యూరేటర్ తెలిపారు. మరణించిన తర్వాత వైద్యుల బృందంతో కదంబను పోస్టు మార్టం చేయగా గుండెపోటుతో చనిపోయిందని వెల్లడైనట్లు వివరించారు. మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి.. రక్త, కణజాలాల నమూనాలను సేకరించి రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ సైన్స్ కళాశాలకు పంపించినట్లు పేర్కొన్నారు.
కదంబ మృతి చెందిన తర్వాత.. 11 రాయల్ బెంగాల్ పులులు పార్కులో ఉన్నట్లు తెలిపారు. అందులో 8 పెద్దవి, మూడు చిన్నవి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో మూడు రాయల్ బెంగాల్ పులుల్లో రోజా 21, సోని 20, అపర్ణ 19 సంవత్సరాలు ఉన్నాయి.
ఇదీ చూడండి:విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'