EPF Minimum Pension: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) కనీస పింఛను పెంపు కోసం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయిదేళ్లుగా రూ.వెయ్యిగా ఉన్న ఈ మొత్తాన్ని పెంచేందుకు ఈపీఎఫ్‌వో ట్రస్టీబోర్డు కమిటీల మీద కమిటీలు వేయడం తప్ప స్పష్టమైన నిర్ణయం వెలువరించడం లేదు. ఇప్పటికే రెండు కమిటీలు నివేదికలు ఇవ్వగా.. మూడు నెలల క్రితం పింఛను సంస్కరణల పేరిట ఏర్పాటు చేసిన అడ్‌హక్ కమిటీ మరో నివేదిక ఇచ్చింది. దీనిపై లోతైన అధ్యయనం చేయాలని కోరుతూ పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ), ఎల్‌ఐసీ, వీవీగిరి కార్మిక శిక్షణ కేంద్రంతో పాటు మరో ఇద్దరు పెట్టుబడుల అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఈపీఎఫ్‌వో ట్రస్టీబోర్డు ఏర్పాటు చేసింది. అడ్‌హక్ కమిటీ నివేదికను పరిశీలించి, కనీస పింఛను ఏ మేరకు పెంచేందుకు అవకాశాలున్నాయో పేర్కొంటూ అవసరమైన మార్గదర్శకాలు సూచించాలని కోరింది.
74 శాతం మందికి రూ.2 వేల లోపు..
2014లో కనీస పింఛను రూ.1000 అమల్లోకి వచ్చేవరకు.. కొందరికి ఏళ్లుగా రూ.100లోపే వచ్చేది. ప్రస్తుతం రూ.2 వేల లోపు పొందుతున్న పింఛనుదారులు 74 శాతం ఉన్నారు. ఇది పలు రాష్ట్రాల్లో ఇచ్చే వృద్ధాప్య సహా ఇతర సామాజిక భద్రత పింఛన్ల సొమ్ముకన్నా తక్కువే. దీంతో పింఛను కనీస మొత్తాన్ని పెంచాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అసంఘటిత కార్మికుల పింఛనును రూ.3 వేలుగా నిర్ణయించడంతో ఆ మేరకు వేతన జీవులకు అవకాశమివ్వాలని కోరాయి. దీంతో అడ్‌హక్ కమిటీని ఈపీఎఫ్‌వో ఏర్పాటు చేసింది. గతంలో రెండు ఉన్నతస్థాయి కమిటీలు కనీస పింఛను రూ.2 వేలు, రూ.3 వేలుగా ఖరారు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇచ్చాయి. రెండేళ్ల క్రితం ఏర్పాటైన కమిటీ కనీస పింఛను రూ.2 వేలు చేస్తే రూ.5,955 కోట్ల అదనపు భారం ఉంటుందని, 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది.
అడ్‌హక్ కమిటీ ఏం చెప్పిందంటే...