తెలంగాణ

telangana

ETV Bharat / state

గాల్లో ఎగిరే తిమింగలం ఎప్పుడైనా చూశారా.. ఓ లుక్కేయండి మరి! - బెలుగా ఎయిర్​బస్​ శంషాబాద్​ విమానాశ్రయం

World largest cargo plane Beluga: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం 'బెలుగా' హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయంలో దిగింది. తిమింగలం ఆకారంలో ఉండి ఈ ఎయిర్​బస్​ దాదాపు 47 టన్నుల సరకును మోసుకుపోయే సామర్థ్యం కలది. చూపరులకు కనువిందు చేసే ఈ భారీ విహంగం సోమవారం బయలుదేరి వెళ్లిపోయింది.

airbus
ఎయిర్​ బస్​

By

Published : Dec 6, 2022, 12:59 PM IST

World largest cargo plane Beluga: తిమింగలం సముద్రంలో కదా ఉండేది.. గాల్లో ఎగరడం ఏమిటి? అనుకుంటున్నారా! మీ సందేహం ఎంత నిజమో.. ఇదీ అంతే నిజం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా పేరు పొందిన బెలుగా. దుబాయిలోని అల్‌ మక్‌తుమ్‌ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గంమధ్యలో ఇంధనం నింపుకొనేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగింది. తిరిగి సోమవారం రాత్రి 7.20 గంటలకు బయల్దేరి వెళ్లింది.

తిమింగలం ఆకారంలో ఉండే ఇది అనేక ప్రత్యేకతలు కల్గి ఉంది. ఎయిర్‌బస్‌ కంపెనీ సరకు రవాణా కోసం ఇలాంటి అయిదు విమానాలనే తయారు చేసింది. సాధారణంగా అన్ని విమానాల్లో వెనుక వైపు నుంచి లోడింగ్‌, ఆన్‌లోడింగ్‌ సదుపాయం ఉంటుంది. దీనికి మాత్రం ముందు నుంచి లోడింగ్‌ చేసే వీలుంది. లోడింగ్‌ సమయంలో ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా అంటోనొవ్‌ ఏఎన్‌-225 మ్రియాకు పేరుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా ఆ విమానాన్ని ఇటీవలే రష్యా ధ్వంసం చేసింది. దీంతో ఇదే అతిపెద్ద కార్గో విమానంతో ఖ్యాతిలోకి వచ్చింది.

బెలుగా ప్రత్యేకతలు ఇవీ..
  1. తొలి విమానం తయారీ
1994 సెప్టెంబరు 13
2. సేవలు ప్రారంభం 1996
3. పొడవు 184.3 అడుగులు
4. ఒక రెక్క వైశాల్యం 2,800 చ.అడుగులు
5. విమానం బరువు 86.5 టన్నులు
6. ఎత్తు 56.7 అడుగులు
7. కార్గో సామర్థ్యం 47 టన్నులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details