ప్రజా సమస్యలను తీర్చేందుకే రాజకీయల్లోకి వచ్చినట్లు బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజ వ్యాస్ బిలాల్ తెలిపారు. 26ఏళ్ల వయసులో తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలు తీర్చేందుకే రాజకీయాల్లోకి: పూజ వ్యాస్ - తెరాస అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజ వ్యాస్ వెల్లడించారు. తనకు అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తానని వివరించారు.
ప్రజా సమస్యలు తీర్చేందుకే రాజకీయాల్లోకి: తెరాస అభ్యర్థి
బేగంబజార్ మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతానని పూజ హామీ ఇచ్చారు. మానవత్వం, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగరేస్తాం: భాజపా అభ్యర్థి
Last Updated : Nov 22, 2020, 4:47 PM IST