గాల్వన్లోయలో భారత సైన్యంపై చైనా సైనికుల దాడిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా సైనికుల చర్యను హైదరాబాద్ బేగంబజార్లోని వివిధ వ్యాపారులు ఖండించారు. చైనా ఉత్పత్తి చేసిన వస్తువులను దుకాణాలలో అమ్మొద్దని వారు నిర్ణయం తీసుకున్నారు.
బేగంబజార్లో చైనా ఉత్పత్తులపై బ్యాన్
భారత సైనికులపై చైనా దాడిపై హైదరాబాద్ బేగంబజార్లోని వ్యాపారులు ముక్తకంఠంతో ఖండించారు. వ్యాపార సంఘాల నాయకులు సమావేశమై చైనా ఉత్పత్తులను అమ్మొద్దని, వాటిని బ్యాన్ చేయాలని నిర్ణయించారు.
చైనా ఉత్పత్తుల బ్యాన్
చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దుకాణాల్లో గల చైనా వస్తువులను దహనం చేశారు. సమీప దుకాణాల వద్దకు వెళ్లి... ఆ దేశ వస్తువులను పగలగొట్టారు. గాల్వన్ లోయ ఘటనలో మరణించిన కర్నల్ సంతోశ్బాబు మృతికి సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి :బీఆర్కే భవన్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్