అభివృద్ధిలో ఆదర్శంగా బేగంబజార్ను తీర్చిదిద్దుతానని భాజపా అభ్యర్థి శంకర్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ పరిధిలో విజయోత్సవ పాదయాత్ర నిర్వహించారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తా : శంకర్ యాదవ్ - బేగం బజార్ భాజపా అభ్యర్థి విజయోత్సవ పాదయాత్ర
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన బేగంబజార్ భాజపా అభ్యర్థి శంకర్ యాదవ్ డివిజన్ పరిధిలో పాదయాత్ర చేపట్టారు. తనపై మరోసారి నమ్మకం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
ఎన్నికల హామీలను నెరవేరుస్తా : శంకర్ యాదవ్
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. భాజపాకు మద్దతుగా నిలిచిన కొందరు వ్యాపారులను తెరాస శ్రేణులు బెదిరించడం మంచిది కాదని హితవు పలికారు.