దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతువులకు రూ.2016
రాష్ట్రవ్యాప్తంగా పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. పెరిగిన పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వులను లబ్ధిదారులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మున్సిపాలిటీల్లో ఉత్తర్వుల పంపిణీ జరుగుతోంది. జూన్ నెల నుంచి పెరిగిన ఆసరా పింఛన్లు వర్తించనున్నాయి. రవీంద్రభారతిలోజరిగిన కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అందరికి కేసీఆరే పెద్ద 'ఆసరా' - పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభం
పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. దివ్యాంగులకు రూ.3016, ఇతరులకు రూ.2016లను పింఛను కింద అందించనున్నారు. పెంచిన పింఛన్లు జూన్ నెల నుంచి అమల్లోకి వచ్చింది.
పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభం
అర్హులందరికి పింఛన్లు అందిస్తాం: మంత్రి తలసాని
అర్హులైన అందరికీ పింఛన్లు అందాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం చాలా నగరాల్లో నీటి కొరత ఏర్పడినట్లు వెల్లడించారు.ఎన్ని ఏళ్లు గడిచినా హైదరాబాద్‌లో చెన్నై తరహా నీటి ఎద్దడి పరిస్థితులు రావని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలు, బతుకమ్మను విదేశాల్లో కూడా ఘనంగా, గర్వంగా జరుపుతున్నారని తలసాని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత
Last Updated : Jul 20, 2019, 4:21 PM IST