తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాపారుల దాతృత్వం.. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ - నిరుపేదలకు సరుకులు పంపిణీ

కరోనా నియంత్రణ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించారు. ఈ సమయంలో నిరుపేదలకు సకాలంలో నిత్యావసర సరుకులు అందట్లేదు. అది గుర్తించినా హైదరాబాద్​ బేగంబజార్​లోని ఇద్దరు వ్యాపారులు మానవత్వం చాటుకున్నారు. నిరుపేదలకు 20 రోజులకు సరిపడే 10 కేజీల బియ్యంతోపాటు పప్పు, నూనే, చింతపండు సరుకులను సరఫరా చేస్తున్నారు.

వ్యాపారుల దాతృత్వం.. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
వ్యాపారుల దాతృత్వం.. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : Mar 27, 2020, 2:02 PM IST

లాక్​డౌన్​ కొనసాగుతున్నందున హైదరాబాద్​లో నిరుపేదలకు సకాలంలో ఆహార పదార్థాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు బేగంబజార్​లోని బంకజ్ భాటియా, రాజేశ్​ సింగ్​ వ్యాపారులు పేదప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. 20 రోజులకు సరిపడే 10 కేజీల బియ్యంతో పాటు పప్పు, నూనె, చింతపండు తదితర వస్తువులను వివిధ బస్తీవాసులకు అందజేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ... సేవాభావంతో పేద వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని వ్యాపారస్థులు కోరారు. ప్రభుత్వం ఇచ్చిన లాక్​డౌన్​కు తమ వ్యాపారస్తులు మద్దతిస్తూ... పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

వ్యాపారుల దాతృత్వం.. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

ఇదీ చూడండి:నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details