ఏకధాటిగా కురిసిన వర్షాలకు పచ్చగా మారిన వనాన్ని... తెల్లటి మల్లెలు కప్పివేశాయేమో అన్నట్టుగా ఉంది. మరో వైపు కమ్మకొస్తున్న కారు మేఘాలు... చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఏపీ విశాఖ ఏజెన్సీ పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల్లో ఈ అద్భుత సోయగం పర్యటకులను ఆకట్టుకుంటోంది.
పాడేరు ప్రకృతి అందం... కనులవిందు - latest updates of vishaka
పచ్చని కొండలు మంచు దుప్పటిని కప్పుకొన్నాయి. ఓ వైపు పొగమంచు వణికిస్తుంటే ... మరో వైపు చల్లటి పవనాల సవ్వడి... వేణుగానంలా మదిని రంజింపజేస్తోన్నాయి. ప్రకృతి అందాలతో... నయనాలకు పసందైన విందును అందిస్తున్న..... ఈ అపురూప దృశ్యం సమ్మోహనపరుస్తోంది.
Breaking News
లాక్డౌన్ సడలింపులు ఇవ్వగా... పర్యాటకులు ఈసహజ సిద్ధ అందాలను సందర్శించేందుకు తరలివస్తున్నారు. ఈ అద్భుత చిత్రాలను తమ చరవాణిలో బంధిస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు.