తెలంగాణ

telangana

ETV Bharat / state

అదరగొట్టే అందాలతో అతివల ఫ్యాషన్ వీక్ - ఫ్యాషన్‌ వీక్‌

మిస్టర్​ అండ్‌ మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రన్‌వే మోడలింగ్‌ అందాల పోటీలు నగరంలో కలర్‌ఫుల్‌గా సాగాయి. అందమైన సుందరాంగులు ర్యాంప్‌పై తమ అందచందాలతో అదరహో అనిపించారు.

అదరగొట్టే అందాలతో అతివల ఫ్యాషన్ వీక్

By

Published : Aug 18, 2019, 10:29 AM IST

ఇండియా రన్‌వే ఫ్యాషన్‌ వీక్‌ మోడలింగ్‌ ఆధ్వర్యంలో మిస్టర్​ అండ్‌ మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రన్‌వే మోడల్‌ అందాల పోటీల ఆడిషన్స్‌ హైదరాబాద్‌లోని సోమాజిగూడలో నిర్వహించారు. అక్టోబర్‌ 12న జరగనున్న ఫైనల్‌ పోటీలకు వీరిలో 10 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్‌తో పాటు ముంబయి, గోవా, దిల్లీ వంటి నగరాల్లో ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తగా మోడలింగ్‌ రంగంలోని వచ్చే వారికి ఇదో చక్కటి వేదిక అని చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో తాము పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పోటీలో పాల్గొన్న అతివలు ఆనందం వ్యక్తం చేశారు.

అదరగొట్టే అందాలతో అతివల ఫ్యాషన్ వీక్

ABOUT THE AUTHOR

...view details