దిగొచ్చిన మేఘం... కనువిందు చేసిన మన్యం - విశాఖ ప్రకృతి అందాలు న్యూస్
కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్లు... భూమాతకు చీర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు... ఎటు చూసినా రమణీయత ఉట్టిపడేట్టుండే ముగ్ధ మనోహర దృశ్యాలు... వర్ణించలేని అందాలకు నెలవు విశాఖ మన్యం. ఈ సౌందర్యానికి హిమం తోడైతే... ఆ అందం వర్ణనాతీతం! ఊటీలోని అందాలను... కొడైకెనాల్లోని సోయగాలను మేళవం చేసినట్టుండే ఆ దృశ్యం... నయనానందకరం!! ఈరోజు ఉదయం అరకును మంచుదుప్పటి కమ్మేసింది.
beautiful nature in vishaka agency