తెలంగాణ

telangana

ETV Bharat / state

సుందర యాదాద్రి.. శరవేగంగా ఆలయ నిర్మాణం - Yadadri temple works

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్​నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. యాదాద్రి ప్రధానాలయంలో సున్నం మరకలు చెడిపి చదును చేసే పనులను కూలీలు చేపట్టారు. శివాలయానికి టేకు కలపతో చేసిన ద్వారాలు యాదాద్రికి చేరుకున్నాయి.

yadadri
యాదాద్రిలో సుందరీకరణ పనులు.. శివాలయానికి టేకు తలుపులు..

By

Published : Feb 5, 2021, 9:43 AM IST

Updated : Feb 5, 2021, 10:02 AM IST

యాదాద్రి ప్రధానాలయంలో సున్నం మరకలు చెడిపి చదును చేసే పనులను కూలీలు చేపట్టారు. శిల్పాలు అతుక్కోవడానికి వేసిన డంగు సున్నం వర్షాలకు తడిసి జారిపోవడంతో శిలలపై తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. ఈవిషయాన్ని ఇటీవల సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్​రెడ్డి గమనించి వెంటనే వాటిని శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక యంత్రాల ద్వారా మచ్చలను తొలగించి.. సుందరంగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయి.

యాదాద్రి సుందరీకరణ పనులు వేగవంతం
యాదాద్రి సుందరీకరణ పనులు వేగవంతం

శివాలయానికి టేకు తలుపులు

యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధిలో భాగంగా శ్రీపర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయానికి టేకు కలపతో రూపొందించిన ద్వారాలు యాదాద్రికి చేరుకున్నాయి. సికింద్రాబాద్​లోని అన్నపూర్ణ టింబర్​ డిపోలో ఆధ్యాత్మికత రూపాలతో సిద్ధపరచిన తలుపులను బిగించే పనులు చేపట్టారు. వీటిపై శైవాగమ చిహ్నాలను పొందుపరిచారు. పునర్​నిర్మితమైన రామలింగేశ్వరుడు ఆలయానికి 12 అడుగుల ఎత్తులో నగిశీలతో రూపొందించిన ఈ ద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

శివాలయానికి టేకు తలుపులు
శివాలయానికి టేకు తలుపులు

స్థానాచార్యుల రాజీనామా ఆమోదం

యాదాద్రి ఆలయ స్థానాచార్యులుగా ఉన్న సందుగుల రాఘవాచార్య రాజీనామాను దేవస్థానం ఈఓ గీతారెడ్డి ఆమోదించారు. గత నెలలో పలు వ్యక్తిగత కారణాలతో స్థానాచార్యులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసుకుని విధుల్లోకి రావాలని నెల సమయం ఇచ్చినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో రాజీనామాను ఆమోదించినట్లు ఆలయ ఈఓ తెలిపారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని దేవాదాయశాఖ కమిషనర్​కు పంపినట్లు తెలిపారు.

రాజీనామా చేసిన సందుగుల రాఘవాచార్య
Last Updated : Feb 5, 2021, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details