తెలంగాణ

telangana

ETV Bharat / state

బోనులో పడిన ఎలుగు... ఊపిరి పీల్చుకున్న స్థానికులు - bear fell on bone news in erramukkam

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఓ ఎలుగుబంటి గ్రామస్థులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

bear-fell-in- one in srikakulam district
బోనులో పడిన ఎలుగు... ఊపిరి పీల్చుకున్న స్థానికులు

By

Published : Jun 5, 2020, 12:24 AM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన బోనులో ఓ ఎలుగుబంటి చిక్కింది. గ్రామంలో తరచుగా ఎలుగుబంటి దాడులు చేయడం... ఆ దాడిలో కొందరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంత మంది తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యారు. ఎలుగుబంటి ప్రమాదం ఉన్న ప్రాంతాలకు అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవటంతో ఎర్రముక్కాం గ్రామానికి చెందిన యువకులే ఎలుగును బంధించడానికి ఇనుప బోనును తయారు చేశారు. బోను ఏర్పాటు చేసిన సుమారు పది రోజుల తర్వాత బుధవారం రాత్రి ఎలుగు బోనులో చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగు గట్టిగా అరుస్తుండటంతో గ్రామస్థులు ఎవరు బోన్ వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు.

ఇదీ చూడండి:డ్రోన్​ను చూడగానే... పరుగుతీశారు...

ABOUT THE AUTHOR

...view details