తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2023, 5:01 PM IST

ETV Bharat / state

యువకుడిపై ఎలుగుబంటి దాడి.. ఎక్కడంటే..?

Bear Attack on Volunteer : ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో ఓ వాలంటీర్​పై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది. అతని ఇంటి సమీపంలోనే దాడి జరగడంతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. వన్యప్రాణులు ఇలా గ్రామంలోకి వచ్చి దాడి చేయటం వల్ల స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

Bear Attack on Volunteer
Bear Attack on Volunteer

Bear Attack on Volunteer : ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా సెట్టూరులోని యాటకల్లు గ్రామంలో హనుమంతరాయుడు అనే వాలంటీర్‌పై ఎలుగుబంటి దాడి చేసింది. తెల్లవారుజామున ఇంటి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దాడిలో గాయపడ్డ ‌అతడ్ని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే గ్రామంలో చిరుత సంచారం.. నేడు ఎలుగుబంటి ఇలా వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలను గురవుతున్నారు.

అటవీశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని గ్రామంలోకి అడవి జంతువులు రాకుండా చూడాలని.. అందుకు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

యువకుడిపై ఎలుగుబంటి దాడి.. ఎక్కడంటే..?

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details