పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు తెరాస దిశానిర్దేశం చేసింది. రెండు నియోజవకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన, అనుభవం ఉన్నవారిని ఏజెంట్లుగా నియమించారు.
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు తెరాస దిశానిర్దేశం చేసింది. తెరాస సీనియర్ నేతలు, ఇంఛార్జిలతో కేటీఆర్... ఫోన్‌లో చర్చించారు. ఫలితం ప్రకటించే వరకు ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
ప్రతి ఆరు గంటలకు ఏజెంట్లు మారేలా ఏర్పాట్లు చేశారు. రెండు స్థానాల్లో గెలుపుపై తెరాస ధీమాతో ఉంది. పెరిగిన పోలింగ్ తమకే అనుకూలమని... పార్టీ వ్యూహాలు ఫలించాయని అంచనా వేస్తోంది. తెరాస సీనియర్ నేతలు, ఇంఛార్జిలతో కేటీఆర్... ఫోన్‌లో చర్చించారు. ఫలితం ప్రకటించే వరకు ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి:టేక్రియాల్ కేజీబీవీలో కరోనా కలకలం... 32 మందికి పాజిటివ్