తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్ధీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండండి

పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ..తప్పించుకు తిరుగుతున్న పార్ధీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారని ఆయన వెల్లడించారు..

పార్ధీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండండి

By

Published : Aug 18, 2019, 11:30 PM IST

పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ..పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగుతున్న పార్ధీముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్​లోని భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఈ ముఠాలుంటాయిని వెల్లడించారు. ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి... తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారని పేర్కొన్నారు. జూలై 26న ఓయూ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇద్దరు మహిళలుండటం..దానికి మహిళనే నాయకత్వం వహించటం...పార్ధీ ముఠా స్వభావమేనని ఆయన వివరించారు.

పార్ధీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండండి
ఇదీ చూడండి: జైట్లీ పరిస్థితి విషమం.. ఎయిమ్స్​కు ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details