Precautions on Holi day: చిన్నాపెద్దా కలిసి రంగులు పూసుకొని హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవడం ఆనవాయితీ. కొన్నిసార్లు చిన్న పొరపాటు.. చిన్న నిర్లక్ష్యం.. ఆ సంతోష వాతావరణాన్ని విషాదం వైపు నడిపిస్తుంటుంది. అలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉత్సవం జరుపుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. నేడు హోలీ పండుగ నేపథ్యంలో రంగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నేత్రాల విషయంలో జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు డాక్టర్ అరోరా సూచిస్తున్నారు.
Precautions on Holi: కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారా.. హోలీ రంగులతో జాగ్రత్త! - be careful if you wear contact lenses on holi
Precautions on Holi day: రంగుల హోలీ వచ్చేసింది. వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా జరుపుకొనే వేడుక ఇది. పోటీపడి మరీ రంగుల నీళ్లు చల్లుకుంటూ ఆ నీళ్లలో మునిగితేలుతారు. ఈ క్రమంలోనే రసాయనాలతో కూడిన కలర్స్‌తో జాగ్రత్త అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కళ్లపై ఎక్కువ ప్రభావం చూపే ఈ రంగులను వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాంటాక్ట్ లెన్సులు వాడేవారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
హోలీ రంగులతో జాగ్రత్త సుమా
హోలీ రంగులతో జాగ్రత్త సుమా!
- హోలీలో ఎక్కువగా సింథటిక్ రంగులు వాడుతుంటారు. రసాయనాలతో కూడిన రంగులు చర్మంతోపాటు నేత్ర ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
- పారిశ్రామిక డైలు, ఆల్కాలీస్‌తో తయారైన ఈ రంగుల్లో సింథటిక్, ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి విషపూరితమైనవి. వీటి వల్ల కొన్నిసార్లు శాశ్వతంగా చూపు దెబ్బతింటుంది.
- ప్రస్తుతం చాలా మంది కాంటాక్ట్ లెన్సులు వాడుతుంటారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లలో రంగులు పడకుండా చూసుకోవాలి.
- కాంటాక్ట్ లెన్సుల్లో హైగ్రోస్కోపిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో అవి సులభంగా నీటిని పీల్చుకుంటాయి. ఈ క్రమంలో రంగు నీళ్లు కళ్లలో పడితే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.
- కళ్లల్లో రంగు పడితే నులమకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతింటుంది. కంటిలో రంగు పడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకొని, అరచేతిలోకి స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని ఆ నీటిలో కళ్లను సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలి.
- కంట్లో నీరు చిమ్మడం, చేతి రుమాలు, టిష్యూ ఉపయోగించి కంటిలో చిక్కుకున్న నలుసు తొలగించే ప్రయత్నం కూడా చేయకూడదు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది.
- ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సూచనలు లేకుండా ఐడ్రాప్స్, ఆయింట్‌మెంట్‌లు వాడకూడదు.
ఇదీ చదవండి:HOLI FESTIVAL: హెలీ పండగకు ఎన్నో పేర్లు.. వాటి ప్రాముఖ్యత మీకు తెలుసా?