ఆంధ్రప్రదేస్లోని నరసరావుపేట ప్రజలందరం కలసి మే 15 నాటికి పట్టణాన్ని కరోనా వైరస్ రహిత ప్రాంతంగా మార్చుకుందామని... బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. నరసరావుపేటలో కరోనా వైరస్ అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు చేపడుతున్న మిషన్ మే 15 కార్యక్రమానికి మన వంతుగా సహకారాన్ని అందిద్దామన్నారు.
'నరసరావుపేటను కరోనా రహితంగా చేద్దాం'
ఏపీలోని నరసరావుపేటను మే 15నాటికి కరోనా రహిత ప్రాంతంగా మారుద్దామని... బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెస్కే ప్రసాద్
మే 15 నాటికి పట్టణంలో కరోనా వైరస్ జీరోస్థాయికి తెచ్చేవిధంగా కృషి చేద్దామన్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వృథా చేసుకోకుండా... ఆన్లైన్ క్లాసులు ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇవీ చదవండి...రాష్ట్ర సరిహద్దులో గొయ్యి తవ్విన తమిళ అధికారులు
TAGGED:
నరసరావుపేట వార్తలు