తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహేంద్రసింగ్ ధోనీ ప్రతిఒక్కరికీ ఆదర్శం' - వైజాగ్​లో ధోనీ గురించి మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవితం అందరికీ ఆదర్శమని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్​ఎస్​కే ప్రసాద్ అన్నారు. విశాఖలో 'బికమింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

msk prasad
'మహేంద్రసింగ్ ధోనీ ప్రతిఒక్కరికీ ఆదర్శం'

By

Published : Feb 7, 2020, 9:15 PM IST

ఏపీలోని విశాఖలో యంగ్ ఇండియన్స్ సంస్థ ఆధ్వర్యంలో 'బికమింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఛేంజ్' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. గీతం విశ్వవిద్యాలయం సహకారంతో 'యంగ్ ఇండియన్స్' వార్షిక సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత జట్టు మాజీ సారథి ఎమ్​ఎస్​ ధోనీ జీవితం ప్రతిఒక్కరికీ ఆదర్శమని ఎమ్​ఎస్​కే ప్రసాద్​ అన్నారు.

మహీ తన జీవితాన్ని మలుచుకున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సామాజిక బాధ్యత దిశగా యువత ముందడుగు వేయాలని యంగ్ ఇండియన్స్ ప్రతినిథులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ పాప్ సింగర్ స్మిత, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం పాల్గొన్నారు.

'మహేంద్రసింగ్ ధోనీ ప్రతిఒక్కరికీ ఆదర్శం'

ఇవీ చదవండి..అమాయకపు చూపులతో కుటుంబ పోషణ కోసం

ABOUT THE AUTHOR

...view details