తెలంగాణ

telangana

ETV Bharat / state

గెస్ట్​ టీచర్లను క్రమబద్ధీకరించి జీతాలు పెంచాలి: ఆర్​.కృష్ణయ్య - హైదరాబాద్ వార్తలు

బీసీ గురుకుల పాఠశాలల్లో గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేశ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​ నారాయణగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

r krishnaiah demands to regulaise guest teachers
గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అర్. కృష్ణయ్య డిమాండ్

By

Published : Apr 25, 2021, 3:11 PM IST

బీసీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్​ టీచర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అర్. కృష్ణయ్య ఆరోపించారు. వారిని తక్షణమే క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నారాయణగూడలో రాష్ట్ర నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీలం వెంకటేశ్​ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలల్లో పనిచేసే 2,200 మంది గెస్ట్ టీచర్లు అనే పదాన్ని తీసివేసి కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చాలని ఆర్. కృష్ణయ్య, వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆన్​లైన్ తరగతుల బాధ్యత అప్పగించిన ప్రభుత్వం... వేతనాల బకాయిలు చెల్లించకుండా వీరి పట్ల నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. టీచర్లకు ఉన్న అన్ని విద్యార్హతలు వీరికి ఉన్నాయని.. వేతనాలను రూ. 14 వేల నుంచి 24 వేలకు పెంచాలని కోరారు. పదేళ్ల బోధన అనుభవం ఉన్నప్పటికీ... ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఎనిమిది నెలలుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని... తక్షణమే క్రమబద్ధీకరించకపోతే లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

ఇదీచూడండి:కరోనాను సమర్థంగా ఎదుర్కొంటాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details