కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరుద్యోగమే కారణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సునీల్ ఆత్మహత్యను రాజకీయం చేయకుండా.. బలవన్మరణాలకు దారి తీస్తున్న కారణాలపై చర్చించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం ఆవేదన కలిగిస్తుందని తెలిపారు.
సునీల్ చావును రాజకీయం చేయం.. కానీ! : ఆర్. కృష్ణయ్య
ఉపాధి లేక నిరుద్యోగులు మనస్తాపానికి గురవుతున్నారని, క్షణికావేశంలో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ మరణానికి నిరుద్యోగమే కారణమని తెలిపారు.
ఆర్.కృష్ణయ్య, సునీల్ నాయక్ ఆత్మహత్య, తెలంగాణలో నిరుద్యోగులు
పే రివిజన్ ప్రకటించినట్లుగా తెలంగాణ సర్కార్.. 1,93,500 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలు ఉండటం వల్ల పాలన కుంటుపడుతుందని చెప్పారు. వయసు పెరిగిపోతున్నందున నిరుద్యోగులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అన్నారు.
- ఇదీ చదవండి :సాగర్ ఉపఎన్నిక బరిపై.. యువత గురి