ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావును కలిసి ఈ విషయంపై చర్చించినట్లు చెప్పారు. 12 బీసీ కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తి ప్రకారం ఒక్కో దానికి రూ.200 కోట్లను కేటాయించాలన్నారు. ఈ బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు.
'బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయించాలి' - హైదరాబాద్ తాజా వార్తలు
ఈ బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్లను కేటాయించాలని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో మంత్రి హరీశ్ రావును కలిసి కోరినట్లు ఆయన తెలిపారు.
!['బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయించాలి' BC Welfare Association National President R.Krishnaiah asked for Rs 10 thousand crore in the budget for BCs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11034414-530-11034414-1615903388275.jpg)
'బడ్జెట్లో బీసీలకు రూ.10 వేల కోట్లు కేటాయించాలి'
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలను మంజూరు చేయాలని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన 238 గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తా: వైఎస్ షర్మిల